TTD11th Dec 11:25 AMSunil Byrisetty2 min read

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యా

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌
టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు - 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు - 75 వేలు, పెద్ద డైరీలు - 8.50 లక్షలు, చిన్నడైరీలు - 3 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు - 2.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు - 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు - 3 లక్షలు, టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు - 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది. ధరలు ఇలా.. – 12 పేజీల క్యాలెండర్ రూ.130/-, – డీలక్స్ డైరీ రూ.150/-, – చిన్న డైరీ రూ.120/-, – టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-, - 6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450/-, – శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-, – శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-, – శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-, – తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/- - టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు - రూ.130/-. డైరీలు, క్యాలెండర్లు టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. ఇందులో 12 పేజీల క్యాలెండర్, డీలక్స్ డైరీ, చిన్న డైరీ, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్, 6 పేజీల 3డి క్యాలెండర్ లను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు తపాలా శాఖ ద్వారా పంప‌బ‌డుతుంది.
Andhra Pradesh
TTD 2026 Calendars
TTD Diaries
Tirumala Tirupati Devasthanams
Srivari Calendars
Padmavathi Calendars
TTD Online Booking
తెలుగు పంచాంగం
తిరుమల వార్తలు
భక్తుల స్పందన
టిటిడీ వెబ్‌సైట్
Scroll for the next article