TTD22nd Jan 11:27 AMSunil Byrisetty1 min read
టీటీడీ అలెర్ట్.. 25న ప్రత్యేక దర్శనాలు రద్దు!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ నెల 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు దర్శనాలు, సేవల్లో మార్పులు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రథసప్తమి రోజ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ నెల 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు దర్శనాలు, సేవల్లో మార్పులు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రథసప్తమి రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు కొన్ని ప్రత్యేక దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించారు. 25న ఆర్జిత సేవలు జరగవని టీటీడీ స్పష్టం చేసింది. చిన్న పిల్లల తల్లిదండ్రుల దర్శనం, సీనియర్ సిటిజన్ల ప్రత్యేక దర్శనం, ఎన్ఆర్ఐ దర్శనం, వికలాంగుల కోసం ఉన్న ప్రివిలేజ్ దర్శనాలను కూడా అదే రోజున రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రోటోకాల్ కింద వచ్చే ప్రముఖులను తప్పించి మిగతా విఐపీ బ్రేక్ దర్శనాలు రథసప్తమి రోజున ఉండవని అధికారులు వెల్లడించారు.