TTD26th Nov 05:58 PMSunil Byrisetty1 min read
వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ ప్రకటన
వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. 10
వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 3 రోజులు మినహా 7 రోజులు టోకెన్లు లేకుండా దర్శనాలకు రావచ్చని తెలిపారు. - 7 రోజులపాటు సామాన్య భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి 3 రోజులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, మిగతా 7 రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు దర్శనాలకు కేటాయించినట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేలు చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.