News5th May 01:07 PMSunil Byrisetty1 min read

వేసవి సెలవుల్లో సులభంగా శ్రీవారి సర్వదర్శనం

వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు సులభతర దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. సెలవుల సందర్భంగా శ్రీవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో

వేసవి సెలవుల్లో సులభంగా శ్రీవారి సర్వదర్శనం
వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు సులభతర దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. సెలవుల సందర్భంగా శ్రీవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం కూడా సామాన్య భక్తులకు కలిసొచ్చింది. నిన్న ఒక్కరోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
TTD
Tirumala
srivari darshan for summer vacation
శ్రీవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు
భక్తులకు సులభతర దర్శనం
ఆర్జిత బ్రహ్మోత్సవం
హుండీ ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం
Scroll for the next article