TTD5th Dec 09:43 AMSunil Byrisetty1 min read
టీటీడీ వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల విడుదలపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్లైన్లో రిలీజ్
తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల విడుదలపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.