TTD24th Jul 09:10 AMSunil Byrisetty1 min read
టీటీడీ విద్యాలయాల్లో కౌన్సెలింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు దేవస్థానం విద్యాశాఖాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు దేవస్థానం విద్యాశాఖాధికారి తెలిపారు.
2025-2026 విద్యా సంవత్సరమునకు సంభందించి ఇంటర్మీడియెట్ ప్రవేశముల కొరకు దరఖాస్తులు ఆహ్వానించి అర్హులు అయిన వారికి 09-06-2025 నుండి మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశములు కల్పించడమైనది. ఆ కౌన్సెలింగ్ యందు మిగిలన సీట్ల భర్తీ కొరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ 25, 26 తేదీలలో నిర్వహించుటకు నిర్ణయించడం అయినది.
ప్రాధాన్యత క్రమం
1). టీటీడీ ఉద్యోగుల పిల్లలకు
2).S.V.బాలమందిరం పిల్లలకు
3).ఏదైనా కారణము చేత ఇదివరకు మూడు విడతల్లో సీటు వచ్చి వివిధ స్వల్ప కారణములచే అడ్మిషన్ పొందలేని వారికి
4).తిరుపతి స్థానిక విద్యార్థులకు (Locals)
5).స్థానికేతరులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
25న ఉదయం 8 గంటల నుంచి ఒంటిగంట వరకు SSCలో 550(90%), ఆ పైన మార్కులు పైన వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు 549 నుండి 500 మార్కులు మార్కుల వారు, 26న ఉదయం 499 మార్కులు నుంచి 450 మార్కులు వచ్చిన వారు, మధ్యాహ్నం 2 PM నుంచి 6 PM వరకు 449 మార్కులు నుంచి 400 మార్కులు వరకు వచ్చిన వారు కి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.