News27th Mar 08:48 AMSunil Byrisetty1 min read
5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాల తీసుకున్నారు. రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయ
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాల తీసుకున్నారు. రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేయడంతోపాటు శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు.
రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.
ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశారు. జూ పార్క్ నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకుండా తీర్మానం చేశారు.
టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.