TTD3rd Oct 11:10 AMSunil Byrisetty1 min read

తిరుమల కొండపైకి ఆ బైక్‌లు నిషేధం!

తిరుమల శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్‌ రోడ్లలో రాపిడో, ఓలా, ఉబర్‌ వంటి బైక్‌ ట్యాక్సీ సర్వీసులను టీటీడీ నిషేధించింది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక భక్తుడు శ్రీవారి దర్శ

తిరుమల కొండపైకి ఆ బైక్‌లు నిషేధం!
తిరుమల శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్‌ రోడ్లలో రాపిడో, ఓలా, ఉబర్‌ వంటి బైక్‌ ట్యాక్సీ సర్వీసులను టీటీడీ నిషేధించింది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక భక్తుడు శ్రీవారి దర్శనానంతరం తిరుపతి విమానాశ్రయానికి వెళ్లేందుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద ద్విచక్రవాహనం క్రాష్ బారియర్‌ను బలంగా ఢీకొనడంతో బైకర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భక్తుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని టీటీడీ యాజమాన్యం అత్యంత తీవ్రంగా పరిగణించి, వాణిజ్య బైక్ రైడ్లను తిరుమలకు అనుమతించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ‘నాట్ అలౌడ్’ పేరిట పోస్టర్లను ప్రదర్శించారు. తిరుమల ఘాట్ రోడ్లలో కేవలం వ్యక్తిగత ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ కొండపైకి రానివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి వాహనాల రాకపోకలపై అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
Scroll for the next article