Politics10th Dec 05:23 PMSunil Byrisetty1 min read
టీటీడీలో శాలువాల స్కాంని బయటపెట్టిన బోర్డు మెంబెర్ జ్యోతుల నెహ్రూ
తిరుమల తిరుపతి దేవస్థానంలో శాలువాల స్కాంని బోర్డు మెంబెర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెలుగులోకి తెచ్చారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చిందన్నారు. కొండపై రూ.1
తిరుమల తిరుపతి దేవస్థానంలో శాలువాల స్కాంని బోర్డు మెంబెర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెలుగులోకి తెచ్చారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చిందన్నారు. కొండపై రూ.1334 లకు కొన్న శాలువాను కింద షాప్ లలో అడిగితే రూ.600 అని చెప్పారన్నారు. విషయం తెలియగానే కొనుగోళ్లు ఆపేశామని, బోర్డు సమావేశంలో చర్చించి విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈనెల 14న జరగబోయే మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, దేవుడి సొమ్ము వృధా కాకూడదని పేర్కొన్నారు. ఈ స్కాం వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.