News27th Apr 11:17 AMSunil Byrisetty1 min read
జూన్ 30 వరకు వీఐపీకి బ్రేక్!
వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బో
వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుంది.
ఈ నేపథ్యంలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఆయన మాట్లాడుతూ మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల కారణంగా కుటుంబాలతో తిరుపతికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు.
భక్తులు ఇబ్బందులు పడకూడడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు.