TTD17th Jul 01:31 PMSunil Byrisetty1 min read
తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్‍కి భూమిపూజ
తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్‍కి టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు భూమిపూజ చేశారు. రెండు దశాబ్ధాలుగా టీటీడీకి ఐఓసీఎల్ ఎల్పీజీ సరఫరా చేస్తోంది. 30 ఏళ్ల పాటు గ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓస
తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్‍కి టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు భూమిపూజ చేశారు. రెండు దశాబ్ధాలుగా టీటీడీకి ఐఓసీఎల్ ఎల్పీజీ సరఫరా చేస్తోంది. 30 ఏళ్ల పాటు గ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్‍తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. 45 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వ చేసేలా ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు రూ.8.13 కోట్లతో ఐఓసీఎల్, టీటీడీ కలిసి నిర్మించనుంది. తిరుమలలో రోజుకు 55 టన్నుల తడి వ్యర్థాలు వస్తాయి.. అందులో 40 టన్నుల వ్యర్థాలను ఐఓసీఎల్‍కు ఇస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. రోజుకు వెయ్యి కేజీల బయో గ్యాస్ ఉత్పత్తి.. టీటీడీ రూ.1.50 కోట్లు ఆదా అవుతుందన్నారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు వివరించారు.