TTD17th Jun 06:37 PMSunil Byrisetty1 min read

రేణిగుంట విమానాశ్ర‌యం పేరు మార్పునకు సిఫార్సు

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌డంతో పాటు, తిరుమ‌ల‌కు ఐకానిక్ గా విమానాశ్ర‌యానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు క

రేణిగుంట విమానాశ్ర‌యం పేరు మార్పునకు సిఫార్సు
తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌డంతో పాటు, తిరుమ‌ల‌కు ఐకానిక్ గా విమానాశ్ర‌యానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యానశాఖ‌కు సిఫార్సు చేయ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని టీటీడీ చైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో టీటీడీ ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లిలో తీసుకున్న నిర్ణ‌యాలను ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు. ఇటీవ‌ల క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసిన సంద‌ర్భంగా వారి అభ్య‌ర్థ‌న మేర‌కు బెంగుళూరులోని ప్ర‌ధాన ప్రాంతంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామన్నారు. ఇందుకు కావాల్సిన 47 ఎక‌రాల స్థ‌లాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కేటాయించ‌గానే ఆల‌యం నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డీ.కుమార స్వామి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి టీటీడీకి 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కేటాయించేందుకు ముందుకు రావ‌డంతో త్వ‌ర‌లోనే బ‌స్సులను తిరుమ‌ల‌కు తీసుకొచ్చేందుకు చర్య‌లు చేపడుతున్నామన్నారు.
Andhra Pradesh news
Tirupati Airport
TTD Chairman B. R. Naidu
Rename Renigunta airport
Sri Venkateshwara international airport
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం
Scroll for the next article