TTD18th Oct 12:46 PMSunil Byrisetty1 min read
శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారీలను నమ్మొద్దు
శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారీలు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూల
శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారీలు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి భక్తులను మోసం చేసిన అనేక సందర్భాలు కూడా బయటపడ్డాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలన్నారు.
దర్శనం లేదా వసతి కోసం ఏ మధ్యవర్తులను సంప్రదించవద్దని భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు. భక్తులను మోసం చేస్తున్న దళారీలను గుర్తించి వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి టీటీడీ ప్రత్యేక డ్రైవ్‌ను నడుపుతోందని వివరించారు. మధ్యవర్తులు, దళారీలు సంప్రదిస్తే విజిలెన్స్, పోలీసుకు ఫిర్యాదు చేయాలని భక్తులను అభ్యర్థిస్తున్నానన్నారు. తిరుమలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడానికి అందరు చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు.