TTD2nd Aug 05:37 PMSunil Byrisetty1 min read

అలిపిరిలోని ఆర్చ్‌పై గంధర్వుల బొమ్మలే!

అలిపిరిలోని ఆర్చ్‌పై అన్యమత బొమ్మలు ఉన్నట్లు అసత్య వార్తలు మీడియాలో రావడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వాస్తవానికి ఆర్చిపైన ఉన్నవి గంధర్వులు పుష్పమాలతో ఉన్న శిల

అలిపిరిలోని ఆర్చ్‌పై  గంధర్వుల బొమ్మలే!
అలిపిరిలోని ఆర్చ్‌పై అన్యమత బొమ్మలు ఉన్నట్లు అసత్య వార్తలు మీడియాలో రావడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వాస్తవానికి ఆర్చిపైన ఉన్నవి గంధర్వులు పుష్పమాలతో ఉన్న శిల్పాలు అని స్పష్టం చేసింది. తిరుపతి అలిపిరిలోని టోల్‌గేట్ ఆర్చ్‌పై "అన్యమత బొమ్మలు" ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం శోచనీయమని ప్రకటనలో పేర్కొంది. ఈ టోల్‌గేట్‌ను ఏళ్ల క్రితమే టీటీడీ నిర్మించిందని వివరించింది. ఈ ఆర్చ్‌ను, సనాతన హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే శిల్పాల రూపంలో, ఎస్వీ శిల్పకళాశాల నిపుణుల సూచనలతో తీర్చిదిద్దారని వెల్లడించింది. ఆ శిల్పాలలో కనిపిస్తున్నవి గంధర్వులు పుష్పమాలతో ఉన్న చిత్రాలు మాత్రమేనని, అయితే, అవి అన్యమత శిల్పాలుగా చిత్రీకరించి, అవాస్తవపు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం పూర్తిగా నిరాధారమైనదే కాకుండా భక్తుల మనోభావాలను గాయపరచే చర్య అని మరోసారి స్పష్టం చేసింది. ఈ తరహా దుష్ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోందని. అసత్య కథనాలను ప్రచురించినా లేదా ప్రసారం చేసినా సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
Andhra Pradesh
TTD
Alipiri Arch
Tirumala Tirupati Devasthanam
False News
Gandharvas Sculptures
Religious Controversy
Hindu Art
అన్యమత బొమ్మలు
శిల్పకళ
ఎస్వీ శిల్పకళాశాల
దుష్ప్రచారం
Scroll for the next article