News21st Apr 05:18 PMSunil Byrisetty1 min read

టీటీడీలో వాచీల‌ ఈ-వేలం మే 1, 2న

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇంద

టీటీడీలో వాచీల‌ ఈ-వేలం మే 1, 2న
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి. కొత్తవి/ ఉపయోగించిన/ పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం (వేల‌ములు) 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ ww.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Tirumala
TTD E Auction
పోర్టల్ ద్వారా ఈ- వేలం
టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం
వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో
Scroll for the next article