News13th Jul 01:28 PMSunil Byrisetty1 min read

డ్రగ్స్ కేసులో టిటిడి ఉద్యోగి అరెస్ట్

తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. గోవిందరాజ స్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ అరెస్టయ్యాడు. రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ కే

డ్రగ్స్ కేసులో టిటిడి ఉద్యోగి అరెస్ట్
తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. గోవిందరాజ స్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ అరెస్టయ్యాడు. రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ కేసులో 3 నిందితులు అరెస్టయ్యారు. వారి వద్ద నుంచి 3 లక్షలు విలువైన 63 గ్రాముల మెత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేశారు. అరెస్ట్ అయిన వారిలో టిటిడి ఉద్యోగి, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ అరెస్ట్ తో సన్నిహిత ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పోలీస్ విచారణలో డ్రగ్స్ సరఫరా, సేవిస్తున్న వారి గుట్టు పోలీసులు లాగుతున్నారు. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న వారికి బయో చెక్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh
Drugs Bust
TTD
Tirupati
Drug Case
Methamphetamine
TTD Employee
Rahul Yadav
Renigunta Police
ఇంజినీరింగ్ విద్యార్థులు
మెత్ స్వాధీనం
పోలీసు విచారణ
Scroll for the next article