TTD16th Oct 03:30 PMSunil Byrisetty1 min read

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవను పురస్కరించుకుని, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం, అదనపు ఈవో సీహెచ్ వెం

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవను పురస్కరించుకుని, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మధ్యాహ్నం వేర్వేరుగా పరిశీలించారు. ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో, అదనపు ఈవో తెలిపారు. భక్తులకు ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించడంతోపాటు పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకోగా, టీటీడీ ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు ఈవో వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, పలువురు టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
Scroll for the next article