News14th Apr 02:59 PMSunil Byrisetty1 min read
3 నెలల్లో చనిపోయింది 43 ఆవులే.. టీటీడీ ఈవో స్పష్టత!
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు స్పందించారు. గత ప్రభుత్వంలో గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. మార్చి 2021 న
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు స్పందించారు.
గత ప్రభుత్వంలో గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు.
మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు.. గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.
ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని ఆరోపించారు.
దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారున్నారు.
2023లో గోశాలకు విజిలెన్స్ అధికారులను సైతం రానివ్వలేదన్నారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆవులు చనిపోయాయని అసత్యాలు ప్రచారం చేశారని, మూడు నెలల్లో 43 ఆవులు మాత్రమే అనారోగ్యంతో చనిపోయాయని అధికారికంగా వెల్లడించారు.
చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.