News19th Apr 04:30 PMSunil Byrisetty1 min read

వైసీపీ హయాంలో గడ్డినీ వదల్లేదు

వైసీపీ హయాంలో టీటీడీలో గోవుల గడ్డిని తినేశారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. గోశాల నుంచి గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని మండిపడ్

వైసీపీ హయాంలో గడ్డినీ వదల్లేదు
వైసీపీ హయాంలో టీటీడీలో గోవుల గడ్డిని తినేశారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. గోశాల నుంచి గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని మండిపడ్డారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి దుర్మార్గుడని, అతడు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని వ్యాఖ్యానించారు. పిల్ వేస్తామంటూ మమ్మల్ని భయపెడుతున్నారన్నారు. పింక్‍ డైమండ్‍పై అనవసర రాద్ధాంతం చేశారని గుర్తు చేశారు. గోశాల అక్రమాలు బయటపడుతాయని హరినాథ రెడ్డి రికార్డులు ఎత్తుకెళ్లారని టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు పేర్కొన్నారు.
Tirumala
TTD Goshala Controversy
YSRCP
గోశాల అక్రమాలు
చైర్మన్ బీఆర్ నాయుడు
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి
Scroll for the next article