TTD16th Sep 09:43 AMSunil Byrisetty1 min read

నేడు టీటీడీ పాలకమండలి భేటీ!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహ

నేడు టీటీడీ పాలకమండలి భేటీ!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన భేటీ కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చ జరపనుంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 24న ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చ జరుపనున్నారు. మరికొన్ని అంశాలపై చర్చించి టీటీడీ బోర్డు తీర్మానం చేయనుంది.
Andhra Pradesh
TTD
Tirumala Tirupati Devasthanams
TTD Board Meeting
Brahmotsavam
Garuda Vahana Seva
Lord Venkateswara
Chandrababu Naidu
పాలకమండలి సమావేశం
బ్రహ్మోత్సవాలు
Scroll for the next article