TTD20th Nov 10:46 AMSunil Byrisetty1 min read

టీటీడీలో నెయ్యితోపాటు జీడిపప్పు!

తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్లలో నకిల

టీటీడీలో నెయ్యితోపాటు జీడిపప్పు!
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్లలో నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చర్యలు తీసుకోకపోగా, వారికి అధికారులు వత్తాసు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం టీటీడీ సెప్టెంబరు 3న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్‌, ఫంక్షనల్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ ఫుడ్స్‌తో పాటు పలు సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల ప్రకారం, టెండర్‌లో పాల్గొనే సంస్థకు కనీసం 75 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అయితే చెన్నైకి చెందిన ఈ రెండు సంస్థలు సమర్పించిన వేబిల్లులను క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేయగా, అవి నకిలీవని తేలింది. దీంతో అధికారులు వాటిని టెండర్ల నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. కనీసం ఆ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో కూడా చేర్చలేదు. పైగా, భవిష్యత్తులో జరిగే టెండర్లలో పాల్గొనేందుకు వీలు కల్పించారు. తాజాగా పిలిచిన యాలకుల టెండర్లోనూ ఈ సంస్థలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
TTD
Tirumala
Cashew Tender Scam
Fake Documents
Procurement Irregularities
TTD Ghee Issue
Tender Violations
కొనుగోలు లోపాలు
ప్రసాదాల నాణ్యత
తిరుపతి
Scroll for the next article