News2nd May 10:13 AMSunil Byrisetty1 min read
భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ వాట్సాప్ ఫీడ్‌బ్యాక్
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిలో ప
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు.
తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు.
సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేట్ చేయాల్సి ఉంటుంది.