Spiritual1st Dec 05:39 PMSunil Byrisetty1 min read

తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో అన్నప్రసాదాలు

తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడిలో జరుగుతు

తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని  ఇతర ఆలయాలలో అన్నప్రసాదాలు
తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టిటిడి ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారి నివేదికను తయారు చేయాలన్నారు. టిటిడిలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
Andhra Pradesh
TTD
Annaprasadam
Temple Food
Hygiene
Tirumala
Anil Kumar Singhal
Temple Administration
Veda Parayana
వేదపారాయణ
అర్చకులు
అభివృద్ధి పనులు
Scroll for the next article