News18th Apr 12:57 PMSunil Byrisetty1 min read
తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాలకు చెక్.. అలిపిరి వద్దే!
కలియుగ దైవం ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం టీటీడీ పాలకమండలి కీలక యోచన చేసింది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోం
కలియుగ దైవం ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం టీటీడీ పాలకమండలి కీలక యోచన చేసింది.
తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది.
ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు.
ఇదే సమయంలో తిరుమల విజన్-2047 అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.
అందులో భాగంగా అలిపిరి వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు.
15 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం అయ్యాయి.
అలిపిరి వద్దే ప్రైవేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రిక్ బస్సుల్లో కొండ పైకి తీసుకెళ్లనున్నారు.
అలిపిరి వద్దే వసతితో పాటుగా అన్ని కౌంటర్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.