News28th Mar 09:03 AMSunil Byrisetty1 min read
టీటీడీకి విరాళాల వెల్లువ.. ఒక్కరోజే!
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్ వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగ
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది.
చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్ వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు.
నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది.
విరాళాల డీడీలను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్, అదనపు ఈవోకు దాతలు అందించారు.
గత 10 రోజుల్లో టీటీడీకి రూ. 30 కోట్లకు పైగా విరాళాలు అందాయి.