TTD8th Sep 04:14 PMSunil Byrisetty1 min read
తిరుమల గోపురంలో శ్రీకృష్ణుడి విగ్రహంపై వివాదం
తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై టీటీడీ స్పందించింది. ఆ విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించడం జరిగ
తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై టీటీడీ స్పందించింది. ఆ విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించడం జరిగిందని, ఈ ఘటనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. శ్రీవారి ఆలయ మహా గోపురంపై వందలాది విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందేనని, దీర్ఘకాలంగా ఎండ, వర్షాలకు గురికావడంతో కొన్ని విగ్రహాలకు మరమ్మతులు అవసరం అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో విగ్రహాల పరిస్థితిని పరిశీలించి, అవసరాన్ని బట్టి విగ్రహాలకు మరమ్మతులు చేయడంగానీ లేదా వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం టీటీడీ చేపడుతోందని వివరించింది. ఇదే క్రమంలో గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి మరమ్మతులు అవసరమైన విషయాన్ని టీటీడీ గుర్తించింది. వెంటనే సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారని వెల్లడించింది.