TTD16th Sep 05:49 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో 1000 ఆలయాలు నిర్మించనున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరక

రాష్ట్రంలో 1000 ఆలయాలు నిర్మించనున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరకు నిర్మిస్తామని దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మతమార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తామన్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపిన ఆయన.. తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతున్నట్లు చెప్పారు. ఈనెల 28న శ్రీవారి గరుడసేవకు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేయబోతున్నామని నాయుడు తెలిపారు.
Andhra Pradesh
TTD
Tirumala
Tirupati
Temples
Hindu Temple
TTD Updates
Brahmotsavam
Garuda Seva
ISRO
Srivari
శ్రీవారి బ్రహ్మోత్సవాలు
గరుడ వాహన సేవ
హిందూ సంప్రదాయం
Scroll for the next article