TTD18th Nov 04:31 PMSunil Byrisetty1 min read
8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం 8 లక్షల మందికి టోకెన్లు అందజేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భ
తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం 8 లక్షల మందికి టోకెన్లు అందజేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 10 రోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు.
మిగతా 7 రోజుల్లో 15 వేల చొప్పున ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టికెట్లు అందిస్తామని పేర్కొన్నారు. రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టెకెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు.
స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలపై మిగిలిన 7 రోజులు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి శ్రీవారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా 27వ తేది భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. పరకామణి కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.