TTD1st Nov 03:07 PMSunil Byrisetty1 min read

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వైద్యసేవ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అందించే శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని వైద్యశాలల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఈవో అనిల

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వైద్యసేవ
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అందించే శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని వైద్యశాలల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే వైద్యనిపుణులు, సిబ్బందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనే అవకాశం కల్పించాలని.. అవసరమైతే శిక్షణ అనంతరం వారి సేవలు వినియోగించుకొనేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక సెల్, విధివిధానాలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా అశ్విని, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వారి సేవలు వినియోగించుకోవాలని ఆయా విభాగాల డైరెక్టర్లకు ఈవో సూచించారు. ఎస్వీ గోసంరక్షణశాలలో గోసేవకు వీలుగానూ చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, కన్యాకుమారి, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన శిక్షణను త్వరలో ప్రారంభించాలని ఆదేశించారు.
Andhra Pradesh
TTD
Tirumala Tirupati Devasthanams
Srivari Seva
Srivari Medical Services
Anil Kumar Singhal
TTD hospitals
Ashwini Hospital
Ayurveda Hospital
శ్రీవారి వైద్యసేవలు
స్విమ్స్
బర్డ్
గోసేవ
వైద్య సేవలు
Scroll for the next article