Spiritual23rd Jul 09:12 AMSunil Byrisetty1 min read
ఆగస్టు నుంచి ఒంటిమిట్టలో అన్నప్రసాదం
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి ఒంటిమిట్టలో మూడుపూటల అన్నప్రసాదం అందించాలని నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి ఒంటిమిట్టలో మూడుపూటల అన్నప్రసాదం అందించాలని నిర్ణయించింది. మరోవైపు తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలన భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆలయ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. 700 మంది వేదపారాయణదారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి మూడు పూటలు ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.