TTD12th Jul 11:03 AMSunil Byrisetty1 min read

అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా 18న

అక్టోబర్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు కోటాను జూలై 18న ఉదయం 10

అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా 18న
అక్టోబర్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 20- 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లుమంజూరవుతాయి. ఆర్జిత సేవా టికెట్లు అయిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయ‌నుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Andhra Pradesh
TTD
Tirumala
Tirupati
Srivari Arjitha Seva
October 2026
Suprabhatham
Thomala Seva
Archana
Kalyanotsavam
ప్రత్యేక ప్రవేశ దర్శనం
శ్రీవాణి ట్రస్టు
అంగప్రదక్షిణం
శ్రీవారి దర్శనం
Scroll for the next article