TTD5th Oct 11:19 AMSunil Byrisetty1 min read

పుకార్లు నమ్మొద్దన్న టీటీడీ

వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా

పుకార్లు నమ్మొద్దన్న టీటీడీ
వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరని పేర్కొంది.
Andhra Pradesh
Temple
TTD
Tirumala
Senior Citizens Darshan
TTD Clarification
Fake Alert
TTD Updates
Devotee Information
Tirupati
తిరుపతి దేవస్థానం
వయోవృద్ధుల దర్శనం
దివ్యాంగుల దర్శనం
టిటిడీ స్పష్టీకరణ
Scroll for the next article