TTD1st Jan 12:33 PMSunil Byrisetty1 min read
టీటీడీ వ్యూహం.. నిరీక్షణకు స్వస్తి
తిరుమలలో భక్తుల గంటల తరబడి నిరీక్షణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీతో చెక్ పెట్టింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చినా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెల
తిరుమలలో భక్తుల గంటల తరబడి నిరీక్షణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీతో చెక్ పెట్టింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చినా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC), స్లాటెడ్ దర్శన విధానంతో గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం కల్పించి ప్రశంసలు అందుకుంటోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తొలిరోజే ఏకంగా 67,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అయినా ఎక్కడా తోపులాటలు, గంటల తరబడి నిరీక్షణ లేకుండా కేవలం 1.5 నుంచి 4 గంటల్లోనే దర్శనం పూర్తయింది. ఇందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటరే కారణం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు 300కి పైగా సీసీటీవీ కెమెరాలు, 42 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను అనుసంధానించారు. ఈ వ్యవస్థ ఆలయ ప్రాంగణాన్ని 3డీ నమూనా రూపంలో తెరపై చూపిస్తుంది. ఏదైనా ప్రాంతంలో 500 మందికి పైగా భక్తులు గుమికూడితే ఆ ప్రాంతం ఎరుపు రంగులోకి మారి అధికారులను అప్రమత్తం చేస్తుంది.