News21st Apr 03:21 PMSunil Byrisetty1 min read

అన్నార్తులకు అండగా.. గోదావరి అన్నదాత!

తులసి రాంబాబు ఒక రైతు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వీరవాసరం ఆయన సొంతూరు. దిక్కు మొక్కు లేని వారికి క్యారేజీలతో ఆహారం అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. చుట్టుపక్కల 18 గ్

అన్నార్తులకు అండగా.. గోదావరి అన్నదాత!
తులసి రాంబాబు ఒక రైతు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వీరవాసరం ఆయన సొంతూరు. దిక్కు మొక్కు లేని వారికి క్యారేజీలతో ఆహారం అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. చుట్టుపక్కల 18 గ్రామాల్లోని నిరాదరణకు గురైన వృద్ధుల ఇంటికే ఉచితంగా క్యారియర్ పంపిస్తున్నారు. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారంటే కొడుకులు, కోడళ్ల ఆదరణ లేని పెద్ద వయసు వారికి క్యారియర్స్ అందిస్తు్న్నారు. వృద్ధులు సైతం ‘కొడుకులు, కోడళ్లు చూడట్లేదు. రాంబాబు క్యారేజీ మా ఆకలి తీర్చుతోంద’ని చెబుతున్నారు. వండుకునే ఓపిక లేని వారికి, పేదవారికి రైతు తులసి రాంబాబు ఇంటికే క్యారేజీ పంపిస్తున్నారు. కులం, ఆస్తి, వయసు చూడకుండా అందిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఇలా సేవ మొదలుపెట్టిన రాంబాబు ఇప్పుడు ఏడో ఏడాది కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిత్యం రాంబాబు ఆహారం తయారు చేసి 160 మందికి క్యారేజీలు అందిస్తున్నారు. వారానికి రెండు రోజులు చేప, చికెన్, గుడ్డు, రొయ్య వండి పెడుతున్నారు. మిగతా ఐదు రోజులు పప్పు కూర, కాయగూరలతో క్యారియర్లు అందిస్తున్నారు. ఉదయం 6 నుంచి వంట ప్రారంభించి, 9.30 ఆ సమయానికి ప్యాకింగ్ చేసి, మధ్యాహ్నం 12.30లోపు అందిస్తారు. రాంబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహితంగా ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం రుచికరంగా ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికీ రెండు క్యారేజీలు కొన్నామని చెప్పారు. తనకు ఉన్నదానిలో ఇలా సేవ చేయాలనే సంకల్పంతో సొంత డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు డొనేషన్లు తీసుకుంటే డబ్బు వస్తుంది కానీ అలా చేయకుండా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో తాను క్యారేజీలు కట్టి పంపిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.
westgodavari
bhimavaram
tulasirambabu
Tulasi Rambabu
18 గ్రామాల్లోని వృద్ధుల ఇంటికే ఉచితంగా క్యారియర్
దిక్కు మొక్కు లేని వారికి క్యారేజీ
Scroll for the next article