News13th Jan 04:29 PMSunil Byrisetty1 min read

సీబీఐ అధికారుల విచారణకు దళపతి

తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ దళపతి సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు విజయ్ ను సీబీఐ విచారించింది. విచారణలో ఈ కింది అంశాలపై స్పష్టమైన డాక్యుమెంట్లు, వి

సీబీఐ అధికారుల విచారణకు దళపతి
తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ దళపతి సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు విజయ్ ను సీబీఐ విచారించింది. విచారణలో ఈ కింది అంశాలపై స్పష్టమైన డాక్యుమెంట్లు, వివరాలు కోరినట్లు సమాచారం. అలాగే కార్యక్రమానికి తీసుకున్న అన్ని అధికారిక అనుమతులపై ప్రశ్నించారు. సభకు అంచనా వేసిన హాజరు, నియంత్రణ ప్రణాళికలపై ప్రశ్నలు సంధించారు. పోలీస్, జిల్లా యంత్రాంగంతో జరిగిన సమన్వయంపైనా అడిగారు. అలాగే సభకు సంబంధించి తీసుకున్న భద్రతా ఏర్పాట్ల పూర్తి వివరాలు తెలపాలన్నారు. ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్ల వ్యయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని సూచించారు. మొత్తం మీద, ఈవెంట్ ప్లానింగ్ నుంచి అమలు వరకూ ప్రతి అంశంపై స్పష్టత కోరుతూ TVK చీఫ్ విజయ్ కు CBI ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
Tamilnadu
CBI Inquiry
Vijay Dalapathy
Tamil Actor Vijay
TVK Party
Political Developments
CBI Officials
Event Permissions
Security Arrangements
పోలీస్ సమన్వయం
ఈవెంట్ నిర్వహణ
తమిళనాడు రాజకీయాలు
Scroll for the next article