News5th Oct 04:26 PMSunil Byrisetty1 min read
నెల్లూరు మేయర్ రేసులో ట్విస్ట్!
నెల్లూరు నగర మేయర్ పదవి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యక్తుల్లో రూప్ కుమార్ యాదవ్ ఒకరు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రూప్ కుమార్ యాదవ్ సాధారణ ఎన్నికల ముందు జరిగిన రాజకీ
నెల్లూరు నగర మేయర్ పదవి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యక్తుల్లో రూప్ కుమార్ యాదవ్ ఒకరు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రూప్ కుమార్ యాదవ్ సాధారణ ఎన్నికల ముందు జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా వేమిరెడ్డి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఇప్పటి వరకు సేవలు అందించిన రూప్ కుమార్ నగర మేయర్ పీఠాన్ని అధిరోహించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మంత్రి నారాయణకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే మంత్రి నారాయణ కుమార్తె రూపంలో కూడా రూప్ కుమార్ యాదవ్ కు మరో అడ్డంకి ఉంది. రేసులో ఉన్న మరో వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూతురు కోటంరెడ్డి సాయి వైష్ణవి. వీరందరిలో రిజర్వేషన్ ఖరారు అయ్యేదాన్ని బట్టి ఎవరికి అవకాశం ఉంటుందో తేలుతుంది. అయితే అవకాశం దక్కితే వీరిలో అందరూ గెలిచేవారుగానే ఉన్నారు.