News26th Jul 10:49 AMSunil Byrisetty1 min read

చౌటుప్పల్ వద్ద ప్రమాదం.. ఏపీ డీఎస్పీలు మృతి

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న అదనపు SP ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు

చౌటుప్పల్ వద్ద ప్రమాదం.. ఏపీ డీఎస్పీలు మృతి
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న అదనపు SP ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపుకు వెళ్లగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అధికారులు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో ఈ డీఎస్పీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద ఘటనపై ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
Accident
DSP Chakradhar Rao
DSP Shantharao Death
Road Accident Telangana
Bhaitapuram Accident
Scorpio Truck Collision
ఆంధ్రప్రదేశ్ డీఎస్పీలు
Scroll for the next article