Telangana6th Oct 10:33 AMSunil Byrisetty1 min read

సైకిల్‌కు లోనిస్తారా.. ఇద్దరు బుడతల హుషారు

ఇద్దరు బుడతలు బ్యాంకుకు వెళ్లి సైకిల్ కోసం లోన్ ఇస్తారా అనడిగారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థాన

సైకిల్‌కు లోనిస్తారా.. ఇద్దరు బుడతల హుషారు
ఇద్దరు బుడతలు బ్యాంకుకు వెళ్లి సైకిల్ కోసం లోన్ ఇస్తారా అనడిగారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాన్ష్, రహస్య తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలని అడిగారు. ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముందని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు "మా దగ్గర భూమి ఉంది… బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ ముచ్చట పడ్డారు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, కస్టమర్లు చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.
Telangana
Sangareddy
Funny News
Kids
Bank Loan
Canara Bank
Viral Story
Heartwarming
Children
హృదయానికి హత్తుకునే సంఘటన
బ్యాంక్ మేనేజర్
కెనరా బ్యాంక్
Scroll for the next article