News14th Dec 05:16 PMSunil Byrisetty1 min read
లోక్ అదాలత్ లో 2 లక్షల కేసుల పరిష్కారం
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆ
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. ఒక్కరోజే 2,00,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ 52.56 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి మార్గదర్శకంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 431 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై. లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 150 కేసులు పరిష్కరించి రూ 2.81 కోట్ల పరిహారం అందజేశారు.