News7th Sep 05:29 PMSunil Byrisetty1 min read
2 లక్షల సీడ్‌బాల్స్‌తో పచ్చదనానికి బాట
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం వన్ ఎర్త్–వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్‌బాల్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, జీవవైవిధ్
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం వన్ ఎర్త్–వన్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్‌బాల్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో వన్ ఎర్త్–వన్ లైఫ్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, సంస్థ వాలంటీర్లు తయారు చేసిన 2 లక్షల సీడ్‌బాల్స్‌ను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అందజేశారు. సీడ్‌బాల్స్ ద్వారా ప్రకృతి పునరుత్పత్తికి, పచ్చదనం పెంపునకు అవకాశం కలుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం వన్ ఎర్త్–వన్ లైఫ్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్యార్థులు, మహిళలు, యువతను పర్యావరణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో పర్యావరణ స్పృహ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పరిశుభ్రత, రీసైక్లింగ్ తదితర అంశాలపై ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు.