Politics18th Jun 05:34 PMSunil Byrisetty1 min read
పల్నాడుకు జగన్.. ఇద్దరు మృతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వైసీపీ నేతలు అడుగడుగునా ఆంక్షలను ఉల్లంఘించారని పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు పోతున్నా జగన్ మాత్రం పట్టించుకోకుండా పర్యటించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన కాసేపటికే కాన్వాయ్‌లోని ఓ వాహనం సింగయ్య అనే ఓ వ్యక్తిని ఢీకొట్టగా ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. తర్వాత సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. జగన్ ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త, మాజీ డిప్యూటీ సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.