News21st Dec 11:53 AMSunil Byrisetty1 min read

రెండు చిన్న చుక్క‌ల‌తో ఆరోగ్య భ‌విత‌

రెండు చిన్న పోలియో చుక్క‌లు ఆరోగ్య‌క‌ర‌మైన భ‌విత‌కు బాట‌లు వేస్తాయ‌ని.. సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద‌క‌ర ఆంధ్రా ల‌క్ష్యాల సాద‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోం

రెండు చిన్న చుక్క‌ల‌తో ఆరోగ్య భ‌విత‌
రెండు చిన్న పోలియో చుక్క‌లు ఆరోగ్య‌క‌ర‌మైన భ‌విత‌కు బాట‌లు వేస్తాయ‌ని.. సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద‌క‌ర ఆంధ్రా ల‌క్ష్యాల సాద‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదివారం న‌గ‌రంలోని చుండూరు వెంక‌ట‌రెడ్డి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల వ‌ద్ద పోలియో బూత్‌ను సంద‌ర్శించారు. చిన్నారుల‌కు స్వ‌యంగా పోలియో చుక్క‌లు వేశారు. రోటరీ నగర్, హెచ్ బీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి స‌మ‌ష్టి కృషి జ‌రుగుతోంద‌ని.. పోలియోను అంత‌మొందించిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉంటూ అయిదేళ్ల‌లోపు చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. త‌ల్లిదండ్రులు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌ప్ప‌కుండా చిన్నారుల‌కు పోలియో డ్రాప్స్ వేయించాల‌ని తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా కూడా మిగిలిపోయిన చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు.
Andhra Pradesh Health
Polio Immunization
Pulse Polio
Child Health
Vaccination Drive
ప్రజారోగ్య ప్రచారం
నివారణార్ధక వైద్యం
బాల్య టీకాలు
సమాజ ఆరోగ్యం
Scroll for the next article