News16th Sep 01:14 PMSunil Byrisetty1 min read
జనవరికి రెండు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ఐటీ, ఆర
అమరావతి క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు ఆయన అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి ప్రజంటేషన్ ఇచ్చారు. గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్‌గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం రెండు దశలుగా రోడ్ మ్యాప్ రూపొందించుకుని ముందుకెళుతున్నామన్నారు. 2030 కల్లా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హర్డ్‌వేర్ ఎగుమతులను సాధించాలన్నదే లక్ష్యమని, దీంతో పాటు ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. రూ.వెయ్యి కోట్ల ప్రోత్సహకాలతో క్వాంటం వ్యాలీలో కనీసం 100 అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ఏర్పాటు చేయాలనేది సంకల్పమన్నారు.