News3rd May 04:00 PMSunil Byrisetty1 min read
బెంబేలెత్తిస్తోన్న బైక్ చోరీలు
మంగళగిరి నగరంలో ద్విచక్ర వాహనాల భద్రతకు కరువవుతోంది. ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఎదుటో, చివరికి ఇంటి ముందు వాహనాన్ని నిలిపి పక్కకు వెళ్లాలన్నా జంకే పరిస్థితుల
మంగళగిరి నగరంలో ద్విచక్ర వాహనాల భద్రతకు కరువవుతోంది.
ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఎదుటో, చివరికి ఇంటి ముందు వాహనాన్ని నిలిపి పక్కకు వెళ్లాలన్నా జంకే పరిస్థితులు నెలకొన్నాయి.
నగరంలో సీసీ కెమెరాలు ఉన్నా చోరీలు మాత్రం ఆగడం లేదు.
టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తామని నిత్యం చెప్పే పోలీస్ ఉన్నతాధికారులకు బైక్ దొంగలు సవాల్ గా మారారు.
తాజాగా నగరంలోని టిప్పర్ల బజారులో గత మూడు రోజులుగా వరుసగా మూడు ద్విచక్ర వాహనాలు చోరీకి గురి అయ్యాయి.
దీంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతోన్నారు. ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలు చాకచక్యంగా చోరీ చేయడం సీసీ కెమెరాల్లో సైతం రికార్డైనట్లు స్థానికులు చెబుతున్నారు.
టిప్పర్ల బజారులోని కొందరు గంజాయి ముఠా సభ్యులు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీ చేసి ఉంటారని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా పోలీసులు దొంగతనాలపై దృష్టి సారించి వాహనాల చోరీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.