News18th Aug 11:44 AMSunil Byrisetty1 min read
రెండు దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెర
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం అసైన్డ్ భూ యజమానులు రెండు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లో
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం అసైన్డ్ భూ యజమానులు రెండు దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అసైన్డ్ భూమి లబ్ధిదారులకు ఊరట కలగనుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ ఈ నెల 12 వ తేదీన సిఆర్డిఏ కమిషనర్ కు లేఖ కూడా రాసారు. మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం గ్రామం లోని సర్వే నంబరు 774లోని 30.72 ఎకరాల భూములు ఆర్ఎస్ఆర్ ప్రకారం చెరువు పోరంబోకు భూమిగా నమోదయి ఉంది. అయితే 1924 - 1926 మధ్య అసైన్డ్ మెంట్ చేశారు. పది సంవత్సరాలు పాటు భూములను యజమానులు విక్రయించరాదని కండీషన్ పట్టాలు ఇచ్చారు. 1936 నుంచి వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ లు జరిగాయి. ఈ నేపథ్యంలో గత 2007 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూములలో భాగంగా ఎర్రబాలెం లోని సర్వే నంబర్ 774 కు కూడా ఆ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మంత్రి లోకేష్ లేఖతో ఈ సమస్యకు తెర పడనుంది.