Notifications13th May 10:42 AMSunil Byrisetty1 min read

టైప్, షార్ట్ హ్యాండ్ పరీక్షా తేదీలివే!

టైపు రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి జి.వి.రామచంద్ర రావు ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ హ్యాండ్

టైప్, షార్ట్ హ్యాండ్ పరీక్షా తేదీలివే!
టైపు రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షల తేదీలను ప్రకటించినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి జి.వి.రామచంద్ర రావు ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ హ్యాండ్ పరీక్షను జూలై 12, 13వ తేదీలలో, టైప్ రైటింగ్ పరీక్షను జూలై 19, 20వ తేదీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మే నెల చివరి వారంలో జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పూర్తి వివరాలు, పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. రాష్ట్ర సాంకేతిక విద్య ,శిక్షణ బోర్డు, మంగళగిరి, అధికారిక వెబ్ సైట్ http://apsbtet.ap.gov.in/#!/index/HomeNotifications. ను సందర్శించాలని జి.వి.రామచంద్ర రావు కోరారు.
Andhra Pradesh
G.V. Ramachandra Rao
TYPE WRITING
SHORTHAND
Notification
టైపు రైటింగ్
షార్ట్ హ్యాండ్ పరీక్షను జూలై 19
20వ తేదీ
శిక్షణ బోర్డు కార్యదర్శి జి.వి.రామచంద్ర రావు
Scroll for the next article