Telangana27th Sep 11:27 AMSunil Byrisetty1 min read

డీఎస్పీగా టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె

పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపు

డీఎస్పీగా టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె
పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. దీంతో ములుగు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని మౌనిక నిరూపించిందని చెబుతున్నారు.
Telangana
Mulugu
Inspiration
Allepu Mounika
Success Story
Group 1
DSP
Motivation
Hardwork Pays Off
Education
Achiever
డీఎస్పీ
తెలంగాణ గర్వకారణం
విద్య
సాధన
పోరాటం
Scroll for the next article