Politics4th Aug 12:17 PMSunil Byrisetty1 min read
త్రిషపై వ్యాఖ్యలు.. ఉదయనిధి అరెస్ట్
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. ఇటీవల కావేరీ జలాల అంశం
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. ఇటీవల కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు "త్రిష.. త్రిష" అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందిస్తూ ఆయన చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీవీకే పార్టీ తంజావూరు మహిళా విభాగం నేత ఎస్. భైరవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉదయనిధిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించింది. ఒక మహిళా నటిని రాజకీయ వివాదంలోకి లాగి ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఉదయనిధి తరఫున ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలైంది.