News30th Apr 05:02 PMSunil Byrisetty1 min read
త్వరలోనే జనగణన, కులగణన
కరోనా కారణంగా 2021లో పూర్తి చేయాల్సిన జనగణన త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని క
కరోనా కారణంగా 2021లో పూర్తి చేయాల్సిన జనగణన త్వరలో జరగనుంది.
ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.
కాంగ్రెస్ అధికార రాష్ట్రాల్లో చేయించిన కులాల సర్వే సరిగా జరగలేదని ఆరోపించారు.
తాము పక్కాగా కులగణన చేయిస్తామని స్పష్టం చేశారు.
కులాల జనాభా లెక్కించి ఆ సంఖ్య ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కొంతకాలంగా కోరుతున్నాయి.
ఈ సమయంలో కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది.