International4th Jan 12:26 PMSunil Byrisetty1 min read
వెనెజులాపై అమెరికా దాడి.. స్పందించిన ఐరాస
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్య ప్రమాదకరమైన సంప్రదాయానికి ద
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్య ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఈ పరిణామం అంతర్జాతీయ చట్టాలను గౌరవించకపోవడమేనని ఆక్షేపించారు. అమెరికాకు చెందిన డెల్టా దళాలు వెనిజులాలోని ఒక సైనిక స్థావరంపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నారు. మదురోపై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో నార్కో-టెర్రరిజం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.